నో తెలంగాణ, సోనియా నిర్ణయం: జనవరిలో ప్రకటన

తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయడం ద్వారా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి తెర దించాలని కాంగ్రెసు అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి తెర దించాలనే పట్టుదలతో కాంగ్రెసు అధిష్టాన ఉన్నట్లు చెబుతున్నారు. యుపిఎ భాగస్వామ్య పక్షాల నాయకులు శరద్ పవార్, మమతా బెనర్జీ, కరుణానిధి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోవడానికి తెలుగుదేశం పార్టీని నిందించే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ మాట మార్చడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కావడం లేదని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీకి జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి కాంగ్రెసు పార్టీకి రెండున్నరేళ్ల వ్యవధి ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి తగిన సమయం కూడా చిక్కుతుందని కూడా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications