సిబిఐకి అందుబాటులో ఉన్నా: ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి

గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుతో తనకు సంబంధం లేదని, అక్రమాలతో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. తాను గనుల శాఖ కార్యదర్శిగా పదవీబాధ్యతలు చేపట్టక ముందే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి)కి గనుల లీజులు మంజూరయ్యాయని ఆమె చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన శ్రీలక్ష్మికి సిబిఐ ప్ర్తత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాన్ని సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒఎంసి కేసులో శ్రీలక్ష్మి నాలుగవ నిందితురాలు. అయితే, ఆమె పేరును సిబిఐ అధికారులు చార్జిషీట్‌లో చేర్చలేదు. ఆమెపై మరింత దర్యాప్తు జరుగుతోందని, అందువల్లనే ఆమె పేరు చేర్చలేదని ఇంతకు ముందు వివరణ ఇచ్చింది.












Click it and Unblock the Notifications