Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టిడిపి తెలంగాణ నేతల తిట్ల దండకం: కెసిఆర్ టార్గెట్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును టార్గెట్ చేసుకుని తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు తిట్ల దండకం అందుకున్నారు. కెసిఆర్‌ను రెచ్చగొట్టే విధంగా వారు శాపనార్థాలు పెడుతున్నారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కెసిఆర్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. దళిత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు కెసిఆర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వరుస విమర్శలతో ఆయన కెసిఆర్‌పై విరుచుకుపడుతున్నారు. తాజాగా, సోమవారం కూడా ఆయన కెసిఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ధ్వజమెత్తారు. పద్నాలుగు ప్రశ్నలు వేస్తూ ఆయన కెసిఆర్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. విద్యార్థులు శ్రీకాంతాచారి, యాదయ్యలపై కెసిఆర్ మనుషులే కిరోసిన్ పోసి వారికి నిప్పంటించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో రహస్య ఒప్పందం చేసుకుని డబ్బులు దండుకున్నారని ఆయన ఆరోపించారు.

తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అంత తీవ్ర స్థాయిలో కాకున్నా కెసిఆర్‌పై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధానంగా తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను టార్గెట్ చేసుకుంటున్నారు. కావాలనే కోదండరామ్ తమ పార్టీని టార్గెట్ చేసుకున్నారని ఆయన సోమవారం వరంగల్లులో విమర్శించారు. తెలంగాణ జెఎసి నుంచి అందరూ బయటకు వస్తారని, తెరాస ఒక్కటే మిగులుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని అప్పుడే చెప్పారని ఆయన అన్నారు.

మరో తెలుగుదేశం తెలంగాణ నాయకుడు కడియం శ్రీహరి కూడా తెరాసపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నారా చంద్రబాబు నాయుడిని అడ్డుకోవద్దని ఆయన తెలంగాణ జెఎసికి సూచించారు. చంద్రబాబును అడ్డుకుంటే తాము తగిన బుద్ధి చెప్తామని ఆయన అన్నారు. తెలగాణకు అనుకూలగా చంద్రబాబు 2008లోనే లేఖ ఇచ్చారని ఆయన అన్నారు. తెరాస, తెలుగుదేశం పార్టీల మధ్య వేడి రాజుకున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నెల 28వ తేదీన కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+