వేటు వేయండి: స్పీకర్‌తో జగన్ వర్గం ఎమ్మెల్యేలు

తాము ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, తాము తప్పకుండా గెలుస్తాం కాబట్టి ఉప ఎన్నికలకు వెళ్లడానికి వెనకాడడం లేదని, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని ఆయన అన్నారు. బంతి వారి కోర్టులోనే ఉందని, తమపై అనర్హత వేటు విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని ఆయన అన్నారు. స్పీకర్‌ను కలిసినవారిలో బాలినేని శ్రీనివాస రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, శోభా నాగిరెడ్డి, గుర్నాథ రెడ్డి ఉన్నారు.












Click it and Unblock the Notifications