వైయస్ జగన్ పార్టీ నాయకుడిపై వేటకొడవళ్లతో దాడి

Kurnool Map
కర్నూలు: కర్నూలు జిల్లాలో ఫాక్షన్ కక్షలు మరోసారి పడగ విప్పాయి. కర్నూలు జిల్లా పాండవగల్లు గ్రామ సమీపంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు దాల్వాయి రామయ్యపై ప్రత్యర్థులు సోమవారం దాడి చేశారు. వేటకొడవళ్లు, కర్రలతో అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో రామయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను తొలుత ఆదోనీ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. రక్తస్రావం ఎక్కువ కావడం వల్ల, తలకు గాయాలు కావడం వల్ల ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఆదోనీ కోర్టుకు హాజరై వస్తుండగా కర్నూలు జిల్లా కోస్గీకి చెందిన రామయ్యపై ఈ దాడి జరిగింది. ముఠా కక్షలతో రామయ్యకు సంబంధం ఉందని పోలీసుసు చెప్పారు. 2009 ఎన్నికల్లో మంత్రాలయం శాసనసభా స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న నేరాలపై జిల్లా ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఈ దాడి జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+