కెసిఆర్ రాక్షసుడు: టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహలు

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి కెసిఆర్ అమ్ముడుపోయినందుకు నిరసనగా తాము ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాదులోని గన్‌పార్కు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ధర్నా చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలకు కెసిఆర్‌దే బాధ్యత అని ఆయన అన్నారు. మూడు ప్రాంతాల్లో పార్లమెంటుకు ఎన్నుకుంటే కెసిఆర్ తెలంగాణ అంశాన్ని సభలో ప్రస్తావించలేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఉరి వేసుకుందాం రమ్మంటే కెసిఆర్ దాక్కున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ తీరు పల్ల బలహీన వర్గాల విద్యార్థులు, యువకులే నష్టపోయారని ఆయన అన్నారు.
తెలంగాణ కోసం ఉరి వేసకుందామంటూ మోత్కుపల్లి నరసింహులు ఇటీవల ఉరితాడుతో గన్ పార్కు వద్దకు చేరుకున్న విషయం తెలిసిందే. కెసిఆర్‌ను టార్గెట్ చేసుకుంటూ ఆయన ఇటీవలి కాలంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications