ముళ్లపెరియార్ డ్యాం: డిఎండికె చీఫ్ విజయకాంత్ అరెస్టు

మద్రాసు విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం 125వ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని వెళుతుండగా వీరు అడ్డుకున్నారు. తమ నేత అరెస్టును నిరసిస్తూ డిఎండికె కార్యకర్తలు కామరాజర్ సలాయ్, సేలం జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. కాగా ఉదయం మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధితో ప్రధాని భేటీ అయ్యారు. కరుణ ముళ్లపెరియార్ డ్యాం అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రధానికి ఓ మెమోరాండాన్ని సమర్పించారు.












Click it and Unblock the Notifications