అన్నా టీమ్‌పై కన్ను: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఖురేషీ

Anna Hazare
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్నా టీమ్‌ వ్యవహారశైలిని పరిశీలించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ చెప్పారు. ఒక పార్టీకి వ్యతిరేకంగా సమస్య కావచ్చునని ఆయన అన్నారు. ఓ జాతీయ టీవీ చానెల్‌తో ఆయన ఆదివారం మాట్లాడారు. అందరి విషయంలో వ్యవహరించినట్లుగా తాము అన్నా జట్టు సభ్యుల విషయంలో వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు వారు ఏ విధమైన ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఫలానా పార్టీకి ఓటేయాలని చెప్పలేదని ఆయన అన్నారు.

తాము ఫలానా పార్టీని బహిష్కరిస్తామని మాత్రమే అన్నా సభ్యులు చెప్పారని, చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడనప్పటికీ ప్రొప్రైటీ సమస్య తలెత్తవచ్చునని వారికి చెప్తామని ఆయన అన్నారు. మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ శాసనసభా ఎన్నికలు జనవరి 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు జరగనున్నాయి. పటిష్టమైన జన లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబడుతూ అన్నా హజారే యుపిఎ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+