హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఉద్యమ ప్రకటనతో విద్యార్థుల గుండెల్లో రైళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కీలెరిగి వాత పెట్టడం తెలుసు. అది మరోసారి రుజువైంది. సరిగ్గా విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయంలో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధపడుతున్నారు. సంక్రాంతి తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, తాను ఆమరణ దీక్ష చేసే ఆలోచనలో ఉన్నానని సోమవారం ప్రకటించారు. దీంతో తెలంగాణలోని విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 24వ తేదీ వరకు, థియరీ పరీక్షలు మార్చి 2 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయి. ఎస్ఎస్‌సి పరీక్షలను మార్చి 26 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు తలపెట్టారు. వీటితో పాటు సిబిఎస్‌సి పరీక్షలు, ఐఐటి - జెఇఇ, ఎంసెట్ వంటి పలు పరీక్షలు ఈ కాలంలో జరుగుతాయి. దీంతో కళాశాలల యాజమాన్యాలు కూడా ఆందోళన చెందుతున్నాయి.

సకల జనుల సమ్మె తర్వాతనే కాస్తా నింపాదిగా తెలంగాణలో విద్యాసంస్థలు నడుస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. నవంబర్ నుంచే విద్యాసంస్థలు సజావుగా నడుస్తున్నాయి. సిలబస్ పూర్తి కావడానికి కూడా చాలా సమయం పట్టే స్థితి ఉంది. విద్యాసంవత్సరం దెబ్బ తింటే విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉంది. నిజానికి, జనవరి నుంచే విద్యా సంస్థలు చురుగ్గా పనిచేస్తూ విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తాయి. ఈ కాలంలోనే మళ్లీ తెలంగాణ ఉద్యమం చెలరేగితే విద్యా సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పడంలో సందేహం లేదు.

English summary
The TRS chief, Mr K. Chandrasekhar Rao’s announcement on Monday that the Telangana agitation would be intensified after Sankranti festival, has got students preparing for various exams across the state worried.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X