కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు, స్పష్టత ఉంది: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
కరీంనగర్: తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, ఈ విషయంలో మా పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తన రైతు పోరుబాట యాత్రలో అన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెసు కలిసి టిడిపిని అణగదొక్కాలని కుట్ర పన్నుతున్నాయని, కానీ ప్రజల్లో టిడిపి బలంగా ఉందన్నారు. రైతు సమస్యలపై పర్యటించేందుకు టిడిపి వస్తుంటే కొన్ని పార్టీల ప్రవర్తన ఎలా ఉందో మీరే చూస్తున్నారన్నారన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం లంబాడపల్లి నుండి ఆయన తన యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, పంటను కొనే నాథుడే లేడని ధ్వజమెత్తారు. బాబ్లీ ప్రాజెక్టుపై మహారాష్ట్రతో పోరాడింది టిడిపియేనని గుర్తు చేశారు.

రాష్ట్రంలో సిగ్గు మాలిన, నీతి మాలిన ప్రభుత్వం ఉందని, కాంగ్రెసు నేతలు పేదలను జలగల్లా పీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం లాభసాటిగా చేసే వరకు టిడిపి పోరాటం చేస్తుందన్నారు. రైతుల పెట్టుబడులు పెరగగా, దిగుబడులు చేసేందుకు ధరలు లేవన్నారు. ప్రభుత్వం ఇచ్చే కిలో బియ్యంలో అరకిలో పురుగులే ఉంటున్నాయన్నారు. కాగా చంద్రబాబు తన పర్యటనలో పంటపొలాల్లో రైతుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu blamed TRS for obstruct him in his Karimnagar Rythu Poru Bata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X