సుబ్బరాయసాగర్ నీటి వివాదం: జెసి వర్సెస్ శైలజానాథ్

JC Diwakar Reddy and Sailajanath
అనంతపురం: జిల్లా సుబ్బరాయసాగర్ నీటి వివాదం మంగళవారం కాస్త ఉద్రిక్త పరిస్తితికి దారి తీసింది. సుబ్బరాయసాగర్ నీటి విడుదల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, జిల్లా సీనియర్ కాంగ్రెసు నేత జెసి దివాకర్ రెడ్డి మంగళవారం స్వయంగా తన కార్యకర్తలతో వెళ్లి తాడిపత్రి రెండో ఆయకట్టుపై ఉన్న ఇసుక బస్తాలను తొలగింప జేశారు. ఇటీవల మంత్రి శైలజానాథ్ వర్గీయులు తాడిపత్రి రెండో ఆయకట్టు వద్ద పుత్తూరు వైపు సుబ్బరాయసాగర్ నుండి నీరు వెళ్లేందుకు ఇసుక బస్తాలు వేయించారని సమాచారం.

దీంతో తమకు నీరు రాకుండా మంత్రి శైలజానాథ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన జెసి వర్గీయులు మంగళవారం ఆ ఇసుక బస్తాలను తొలగించారు. తమకు నీటిని కేటాయించిన తర్వాతే పుత్తూరుకు నీటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. వారు వేసిన ఇసుక బస్తాలను జెసి తీసివేయించడంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+