వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌పాల్‌పై కేంద్రాన్ని కడిగి పారేసిన సుష్మాస్వరాజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sushma Swaraj
న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లుపై ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని లోకసభలో కడిగి పారేశారు. సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆమె కాంగ్రెసు తీరుపై విరుచుకు పడ్డారు. ప్రభుత్వం తీవ్ర నిరాశల మధ్య లోక్‌పాల్ బిల్లు ప్రవేశ పెట్టినట్లుగా కనిపిస్తోందని, ప్రవేశ పెట్టిన బిల్లు బలహీనంగా, అసమగ్రంగా ఉందని విమర్శించారు. మంత్రి బిల్లుపై వివరణ ఇవ్వకుండా రాజకీయ ప్రసంగం చేశారన్నారు. బిల్లులో జాతీయ దృక్ఫథం కొరవడిందన్నారు. బిల్లును ఆమోదించుకోవడం కంటే సభలో గొడవకే అధికార పక్షం ప్రయత్నించినట్లుగా కనిపిస్తోందన్నారు.

బిల్లులో చాలా లోపాలు ఉన్నాయని, లోకాయుక్త రాష్ట్రాలకు సంబంధించినదని దాన్ని బిల్లులో చేర్చడం సరికాదన్నారు. ప్రస్తుత బిల్లు రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకునే విధంగా ఉందన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లు రాష్ట్రాలకు తప్పనిసరి చేయడం సబబు కాదన్నారు. రాష్ట్రాల జాబితాపై కేంద్రం చట్టాలు చేయలేదన్నారు. బిల్లుపై మంత్రుల మధ్యే విభేదాలు ఉన్నాయన్నారు. రిజర్వేషన్ లేకుండానే మైనార్టీలు ఈ దేశంలో అత్యున్నత పదవులు అనుభవించారని, కానీ కాంగ్రెసు దేశాన్ని మతప్రాతిపదికన విభజించే కుట్ర చేస్తుందన్నారు.

English summary
BJP leader Sushma Swaraj lashes out at congress governement about Lokpal bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X