హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై అధిష్టానం హామీ: పరిశీలనే అన్న ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణపై టి-పార్లమెంటు సభ్యులకు అధిష్టానం హామీ ఇచ్చినందు వల్లే వారు మంగళవారం జరిగిన లోక్‌పాల్ బిల్లు ఓటింగులో పాల్గొన్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మంగళవారం ఓటింగుకు హాజరు కావాలా వద్దా అని ఎంపీలు పార్లమెంటు సెంట్రల్ హాలులో చర్చిస్తున్న సమయంలో అధిష్టానం కదిలి వచ్చి హామీ ఇచ్చిందని దాంతో వారు ఓటింగుకు హాజరయ్యారనే వార్తలు వచ్చాయి. సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తెలియజేస్తామని మొదట ఓటింగుకు హాజరు కావాలని వారికి నచ్చజెప్పిందట.

అయితే హామీ వచ్చిందన్న వార్తలను ఎంపీలు కొట్టి పారేశారు. తమకు హామీ రాలేదని కేవలం పరిశీలనలో ఉందని మాత్రమే అధిష్టానం చెప్పిందని ఎంపీ వివేక్ చెప్పారు. అవకాశం ఉన్నప్పుడల్లా తెలంగాణ కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. తెలంగాణ అంశంపై సీరియస్‌గా చర్చిస్తున్నామని తెలిపారన్నారు. సీరియస్‌నెస్ గుర్తించామని చెప్పడం వల్లే ఓటింగుకు హాజరయ్యామన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారన్నారు. 2009లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కోసమే మేం పోరాటం చేస్తున్నామన్నారు.

English summary
Rumors were came out that Congress high command make promise to T-Cong. MPs on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X