హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూవివాదమే పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ప్రాణం తీసింది

By Pratap
|
Google Oneindia TeluguNews

Patolla Govardhan Reddy
హైదరాబాద్: గ్యాంగస్టర్ పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ప్రాణాలను భూవివాదమే తీసినట్లు సమాచారం. వెంకటరెడ్డి అనే వ్యక్తికి, గోవర్దన్ రెడ్డికి మధ్య హైదరాబాద్ సమీపంలోని ఉప్పల్‌లో గల భూమి గొడవనే అతని హత్యకు కారణమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఉప్పల్‌లోని చిల్కానగర్‌లో గల 8 ఎకరాల భూవివాదాన్ని పటోళ్ల గోవర్ధన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడే పరిష్కరించినట్లు, అందుకు ప్రతిగా రెండెకరాల భూమిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ భూమిని విఠల్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద గోవర్ధన్ రెడ్డి రిజిష్టర్ చేయించినట్లు చెబుతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఆ భూమిని సొంతం చేసుకునే ప్రయత్నాలు సాగించాడని అంటారు.

వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆ భూమిని తనకు ఇచ్చేయాలని, తన పేరు మీద రిజిష్టర్ చేయించాలని గొడవకు దిగినట్లు ఓ ప్రముఖ టీవీ చానెల్ వార్తాకథనాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, అందుకు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి నిరాకరించడాని చెబుతున్నారు. ఈ వివాదమే గత కొద్ది రోజులుగా నడుస్తోంది. దీనిపైనే పటోళ్ల గోవర్ధన్ రెడ్డి మంగళవారం ఓ శాసనసభ్యుడిని కలవడానికి వెళ్లాడని చెబుతారు. అయితే ఎమ్మెల్యే కలవలేదని తెలుస్తోంది. దాంతో తిరిగి వస్తుండగా తనతో పాటు ఆటోలో ఉన్న అనుచరుడు అనిల్ మరికొంత మంది సాయంతో హత్య చేసినట్లు చెబుతున్నారు.

తనకు తన అనుచరుల నుంచి ప్రాణభయం ఉందని భావించిన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అనిల్ అనే అనుచరుడిని వెంటేసుకుని వాహనాలను వదిలేసి గత కొద్ది రోజులుగా తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అనిల్‌తో కలిసి ప్రత్యర్థులు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యకు కుట్ర చేశారని ఓ ప్రముఖ టీవీ చానెల్ కథనం.

English summary
According to a Telugu TV Channel report - Patolla Govardhan Reddy was murdered in a land row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X