వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థేన్ బీభత్సం: కల్లోలంగా నెల్లూరు, ప్రకాశం తీర ప్రాంతం

By Srinivas
|
Google Oneindia TeluguNews

nellore
హైదరాబాద్: థానే తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావం కారణంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని తీర గ్రామాల్లో ఈదురు గాలులు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల సముద్రం ముందుకు వచ్చింది. ప్రకాశం జిల్లాలోను థానే ప్రభావం కనిపిస్తోంది. కొత్తపట్నం సముద్రతీరంలో పదిహేను అడుగుల మేర అలలు ఎగిసి పడుతున్నాయి. తూర్పు గోదావరి అంతర్వేదిలో సముద్రం సుమారు రెండు వందల మీటర్లు ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల లక్షలాది రూపాయల విలువైన పంటలు ధ్వంసమయ్యాయి. తీర ప్రాంతవాసులను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

థానే తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టేంత వరకూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఢిల్లీలో ఉన్న సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అధికారులు ఆదేశించారు. రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి, సిఎస్‌లతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సహాయక పునరావాస కేంద్రాల్లో వసతులు అందించి ఆహారం, మందులు సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు. చేపల వేటకు వెళ్లకుండా నియంత్రించాలని సూచించారు. థేన్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై తక్కువగానే ఉంటుందని విపత్తు నిర్వహణ కమిషనర్ రాధ తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మేఘాలు కమ్ముకోవడం వల్ల మధ్యాహ్నం వర్షాలు పడే అవకాశముందన్నారు.

కాగా థానే తుఫాను పుదుచ్చేరికి ఆగ్నేయంగా తమిళనాడు తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడులలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఒకటవ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. విద్యాసంస్థలకు, ప్రభుత్వాధికారులకు సెలవు ప్రకటించారు. తుఫాను కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు మరికొన్ని గంటలు పట్టే అవకాశముంది.

English summary
Thane Cyclone created very tension 
 
 in coastal area like Nellore and 
 
 Prakasam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X