హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్, బొత్స మధ్య సయోధ్యకు ఆజాద్ ప్రయత్నాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య గల విభేదాలను తొలగించడానికి పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్డీ గులాం నబీ ఆజాద్ నడుం బిగించినట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలో ఆజాద్ హైదరాబాద్ వచ్చినప్పుడు వారిద్దరితోనూ చర్చలు జరిపి, విభేదాలను రూపుమాపడానికి ప్రయత్నిస్తారని అంటున్నారు. ఆజాద్ ఓ సమావేశానికి హాజరయ్యేందుకు ఈనెల 5న హైదరాబాదుకు వస్తున్నారు. అవసరమైతే ఆయన ఒక రోజు అక్కడే ఉండి, ముఖ్యమంత్రి, బొత్సా మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని ఎఐసిసి వర్గాలు చెబుతున్నాయి. వీరి విభేదాల మూలంగా పార్టీకి నష్టం జరుగుతోందని రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు అధినాయకత్వానికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఇరువురి మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించకపోతే ముందుముందు మరిన్ని సమస్యలు ఎదురవుతాయని వారు కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు సమైక్యంగా పని చేయటం లేదని వారంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మూలంగా కాంగ్రెస్‌కు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడి వైఖరి మరింత కుంగదీస్తున్నాయని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే వీరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలని అనుకుంటోంది.

English summary
It is said that Congress Andhra Pradesh affairs incharge Ghulam Nabi Azad is a bid to solve differences between PCC president Botsa Satyanarayana and CM Kiran kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X