మద్యం,తెలంగాణ: బాబు,జగన్‌పై విరుచుకుపడ్డ కాంగ్రెస్

రాష్ట్రంలో బెల్టు షాపులకు తాళం చెవులు ఇచ్చిందే చంద్రబాబు అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మద్యం నిషేధానికి బాబు తన హయాంలో తూట్లు పొడిచి ఇప్పుడు కాంగ్రెసుపై విరుచుకు పడటం విచారకరమన్నారు. కాంగ్రెసుకు ఓట్లు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారం దూరమైనప్పటి నుండి ఆయనకు నిద్ర పట్టడం లేదన్నారు. బాబు చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి వెదవ పనులని రుద్రరాజు పద్మరాజు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మధ్యాంద్ర ప్రదేశ్‌గా మార్చింది బాబే అన్నారు. సిబిఐ దర్యాఫ్తుకు సిద్ధమని బొత్స అంటే బాబు స్టేలు తెచ్చుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications