హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేలపై త్వరగా వేటు వేయాలి: జానా రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

K Jana Reddy
హైదరాబాద్: విప్‌ను ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులపై త్వరగా అనర్హత వేటు వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకునే విషయంపై జాప్యం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకోవడాన్ని ఇంకా మంచిది కాదని ఆనయ అన్నారు. వైయస్ జగన్ శానససభ్యులపై చర్యలు తీసుకుంటేనే కాంగ్రెసు పార్టీకి, ప్రభుత్వానికి మంచిదని ఆయన అన్నారు.

తెలంగాణకు శాశ్వత పరిష్కారం వస్తుందని ఆనయ అన్నారు. తెలంగాణపై తాము వెనక్కి తగ్గలేదని ఆయన అన్నారు. తాను మాట్లాడకపోతే వెనక్కి తగ్గినట్లు కాదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజకీయ పార్టీల మధ్య సహకారం మంచిదేనని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తమ పోరాటం కొనసాగుతుదని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య 1012లో పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అధిష్టానానికి తమ అభిప్రాయాలను పదే పదే తెలియజేశామని, ఇప్పుడు సందర్భానుసారంగా చెబుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ఇప్పటికీ రగులుతున్న అంశమేనని ఆయన అన్నారు. లోక్‌పాల్, అన్నా దీక్షలపై చర్చ జరుగుతున్నందు వల్లనే తాము ఢిల్లీ వెళ్లడం లేదని ఆయన చెప్పారు.

మద్యం సిండికేట్లపై ఆయన స్పందించారు. ఏ రాజకీయ పార్టీకైనా ఇలాంటి తలనొప్పులు ఎదురు కావడం సబబు కాదని ఆయన అన్నారు. వీలైనంత త్వరగా వీటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో లేదా పార్టీ అంతర్గత సమావేశంలో దానిపై తాను ముఖ్యమంత్రికి తగిన సూచనలు చేస్తానని ఆయన అన్నారు.

English summary
Minister K Jana Reddy suggested that action on YS Jagan camp MLAs should be taken without delay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X