నేనొక్కడినే తురుంఖాన్‌ను కాదు, ఫెయిల్ అయ్యా: కెకె

K Keshav Rao
హైదరాబాద్: తెలంగాణ సాధనకు అందరం కలిస్తేనే డెడ్ లైన్ పెట్టగలమని, నేనొక్కడినే తురుంఖాన్‌ను కాదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు ఆదివారం అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణమిచ్చేందుకైనా తాను సిద్ధమని ప్రకటించారు. సొంత పార్టీపై, ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. ఇన్ని ఉద్యమాలు జరిగినా ఇంకా తెలంగాణ సాధించలేకపోవడం శోచనీయం అన్నారు. ఈ విషయంలో తాను ఫెయిల్ అయ్యానన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రకటించిన కేంద్ర హోంమంత్రి చిదంబరం, కాంగ్రెస్ పార్టీ ఇంకా తన వైఖరి వెల్లడించలేదని విమర్శించారు. ఈ విషయమై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇచ్చే అంశం పరిశీలిస్తున్నామని కేకే తెలిపారు.

తెలంగాణ ఉద్యమం కోసం కెసిఆర్ కేంద్ర మంత్రి పదవిని వదులుకోవడం తనతో పాటు ప్రజలకు స్ఫూర్తి నిచ్చిందన్నారు. టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఉద్యమాన్ని నీరుగార్చామని కిరణ్‌ కుమార్ రెడ్డి ప్రభుత్వం భ్రమిస్తున్నదని, ఉద్యమకారుల రక్తం కళ్ల చూస్తున్నదనీ, ఎసిబి దాడులు, ఐటి లెక్కల పేరుతో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తోందని ఆరోపించారు. సందర్భం వచ్చినప్పుడు ఈ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని పాతరేస్తారన్నారు. అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమానికి అంకితమవుతామని బిజెపి శాసనసభా పక్ష నేత యెండల లక్ష్మీ నారాయణ చెప్పారు. తెలంగాణ రాకుండా సీమాంధ్ర పెట్టుబడిదారులు కుట్రలు చేస్తున్నారని, తెలంగాణలో చంద్రబాబు పర్యటన ఇందులో భాగమని జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు.

తమపై దాడులు జరుగుతున్నా తెలంగాణ అభిమన్యులు పోరాడుతూ చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారని చెప్పారు. ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులకు నోటీసులు జారీచేసి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామిక హక్కును సాధించుకునేందుకు జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని అన్నారు. ఉద్యోగ సంఘాలను విభజించే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ చెప్పారు. అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని టిఎన్‌జిఓ సంఘం అధ్యక్షుడు స్వామిగౌడ్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+