కెసిఆర్ సీమాంధ్రవాడు, తెలంగాణ ముసుగు: మోత్కుపల్లి

Mothukupally Narasimhulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సీమాంధ్ర వాడని, తమ తెలంగాణ ముసుగులో ఇక్కడి ప్రాంత ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కెసిఆర్ ముమ్మాటికీ వలసవాదేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ విజయనగరం జిల్లా బుడ్డిపేటకు చెందినవారని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో చంద్రబాబు పోరుబాటను అడ్డుకుంటే సంభవించే పరిణామాలకు కెసిఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ పేరు మీద కెసిఆర్ కోట్లు దండుకుంటున్నారని, కెసిఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

కెసిఆర్, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌లవి ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తరప్రగల్భాలు అని ఆయన అన్నారు. వారి వల్ల ఊదు కాలదు, పీరు లేదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు వరంగల్ పోరుబాటును అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు నల్లగొండ జిల్లాకు రాలేడని, మెదక్ జిల్లాలో పర్యటించలేడని, మెదక్ జిల్లాలో తిరగలేరని, కరీంనగర్ జిల్లాలో పర్యటన చేయలేరని అన్నారని, ఆ జిల్లాల్లో చంద్రబాబు పర్యటించారని ఆయన అన్నారు. తెలంగాణ కెసిఆర్ సొత్తు కాదని ఆయన అన్నారు. విజయనగరం జిల్లా బుడ్డిపేటకు చెందిన కెసిఆర్ తెలంగాణ సెంటిమెంటుతో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+