శ్రీలక్ష్మికి షాక్: బెయిల్‌ను రద్దు చేసిన హైకోర్టు

గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని సిబిఐ నవంబర్ 28వ తేదీన అరెస్టు చేసింది. ఆ తర్వాత రెండు రోజులు తమ కస్టడీలోకి తీసుకున్న సిబిఐ ఆమెను ప్రశ్నించింది. ఆమెను సిబిఐ డిసెంబర్ 1వ తేదీన కోర్టులో హాజరు పరిచింది. శ్రీలక్ష్మి బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ఆమె బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటషన్‌లో వాదించింది. సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత శ్రీలక్ష్మి రెండు సార్లు సిబిఐ ముందు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఓసారి సిబిఐ కోర్టులో కూడా హాజరయ్యారు. అప్పట్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి గాలి జనార్దన్ రెడ్డికి మేలు చేకూర్చే విధంగా వ్యవహరించారని సిబిఐ ఆరోపించింది.












Click it and Unblock the Notifications