జగన్ ఎమ్మెల్యేలపై చర్యలకు ఆజాద్‌కు విహెచ్ లేఖ

V Hanumanth Rao
హైదరాబాద్: పార్టీ విప్‌ను ధిక్కరించి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన పార్టీ శాసనసభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఆజాద్‌కు ఓ లేఖ రాశారు. జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇంకా ఆలస్యం జరిగితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. కడప లోకసభ ఉప ఎన్నిక పార్టీ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం వల్ల నష్టం జరిగిందని, ఈసారి అలా కాకుండా అభ్యర్థుల ఎంపికపై వెంటనే దృష్టి పెట్టాలని ఆయన చెప్పినట్లు సమాచారం.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఆలస్యం జరగడం వల్ల పార్టీ కార్యకర్తల్లో నిరాశానిస్పృహలు చోటు చేసుకున్నాయని, వీలైనంత త్వరగా వాటిని భర్తీ చేయాలని ఆయన అన్నారు. శాసనసభ్యులకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలనే ఆలోచన సరైంది కాదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసి ఎలాంటి అవకాశాలు రానివారికి ఈ పదవులు ఇవ్వాలని ఆయన సూచించారు. త్వరలో జరిగే సమన్వయ కమిటీ ఈ విషయాలన్నింటిపై చర్చించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆజాద్‌ను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+