ఓ ఆంగ్ల దినపత్రికకు వైయస్ జగన్ బహిరంగ లేఖ

అగ్రశ్రేణి పత్రిక తెలుగుదేశం పార్టీ చేతిలో పావుగా మారడం తనకు మనస్తాపాన్ని కలిగించిందని ఆయన అన్నారు. ఎల్లో మీడియా సిండికేట్‌లో ఆ పత్రిక భాగస్వామి అయినందుకు మనస్తాపం కలిగిందని ఆయన అన్నారు. గడిచిన కొంత కాలంగా తన ప్రతిష్టను, తన పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా తరుచు ఆ ఆంగ్ల దినపత్రికలో వార్తాకథనాలు వస్తున్నాయని ఆయన అన్నారు. తాను నవంబర్ 18వ తేదీన ఢిల్లీలో ఉండి, కాంగ్రెసు పార్టీతో విలీనానికి ప్రతిపాదనలు చేసినట్లు వచ్చిన వార్తాకథనంపై ఆయన వివరణ ఇచ్చారు. తాను 18వ తేదీన గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
అరెస్టును తప్పించుకోవడానికి తాను కాంగ్రెసుతో రాయబారాలు నడుపుతున్నట్లు ఆ పత్రిక చేసిన వ్యాఖ్యను ఆయన వ్యతిరేకించారు. అరెస్టును తప్పించుకోవాల్సిన అవసరం తనకు ఏమొచ్చిందని, తాను ఏ నేరం చేశానని, పత్రిక నడపడమే తాను చేసిన నేరమన్నట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై కూడా ఆయన తన బహిరంగ లేఖలో వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications