సిఎం ఎసి గదిలో కులుకుతున్నాడు: చంద్రబాబు

Chandrababu Naidu
విజయనగరం: కల్తీ సారా తాగి 18 మంది మరణిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎసి గదిలో కులుకుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కల్తీ సారా బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఆయన సోమవారం మైలవరంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బాధితులను పరామర్సించడానికి కూడా రాకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఎసి గదిలో కులుకుతూ ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కిరణ్ కుమార్ రెడ్డి అనర్హుడని ఆయన అన్నారు. ఒక్క కాంగ్రెసు శాసనసభ్యుడు కూడా సంఘటనా స్థలానికి రాలేదని, వారి చూసి తాను సిగ్గుతో తల దించుకుంటున్నానని ఆయన అన్నారు. వంద మంది కాంగ్రెసు నాయకులకు మద్యం సిండికేట్లతో సంబంధాలున్నాయని, జిల్లాలవారీగా మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మద్యం దుకాణాలను పంచుకున్నారని ఆయన ఆరోపించారు.

సోనియా కాళ్ల వద్ద కాంగ్రెసు నాయకులు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కల్తీ సారా తాగి మరణించినవారంతా బడుగు, బలహీన వర్గాలకు చెందినవారేనని ఆయన అన్నారు. మద్యాన్ని ఎమ్మార్పీ రేట్లకు అమ్మి ఉంటే వారు కల్తీ సారా బారిన పడి ఉండేవారు కాదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి పేదవారంటే లెక్కలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు పేదలను రాబందుల్లా పీడిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పేదవారికి మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఊరూరా బెల్టు షాపులను మాత్రం అనుమతిస్తోందని ఆయన అన్నారు. కల్తీ సారా తాగి 18 మంది మరణిస్తే పరామర్శించడానికి కూడా ముఖ్యమంత్రి రాలేదని ఆనయ దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+