హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసులో మరిన్ని అరెస్టులు, శిక్ష తప్పదు: డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మరిన్ని అరెస్టులు తప్పువని ప్రాథమిక ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం అన్నారు. జగన్ ఛార్జీ షీటులో ఉన్న వారందరూ రాష్ట్రంలోని సహజవనరులను దోచుకునే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. తప్పు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఈ కేసులో సిబిఐ పూర్తి ఆధారాలు సేకరించిందన్నారు. సాయి రెడ్డి అరెస్టు ఓ భాగం మాత్రమేనన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్ర వనరులను ఏవిధంగా దోచుకునేందుకు అవకాశమిచ్చారో సాక్ష్యాలు విశ్లేషించి ఏ మేరకు చార్జీ షీటులోని వారు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించారో సిబిఐ సేకరించిందన్నారు.

జగన్ కంపెనీల్లో పెట్టుబడులు ఎలా పెట్టారు, ఎక్కడ నుండి సేకరించారు తదితర అంశాలు అన్నీ ఉన్నాయన్నారు. జగన్ దోపిడిలో సాయిరెడ్డి కేవలం సూత్రదారి మాత్రమే అన్నారు. కాగా డిఎల్ రవీంద్రా రెడ్డి మొదటి నుండి జగన్‌పై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన పలుమార్లు అన్నారు. కడప పార్లమెంటు బరిలో జగన్‌పై ఆయన పోటీకి కూడా దిగారు.

English summary
Minister DL Ravindra Reddy said that arrests will continue in YSR Congress Party chief YS Jaganmohan Reddy properties case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X