హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను నమ్మడం లేదు: తెలంగాణ ప్రకటనపై కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్/వరంగల్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసినంత మాత్రాన ఇక్కడి ప్రజలు ఆయనను నమ్మరని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం అన్నారు. ఆయన వచ్చే పార్లమెంటు సమావేశాల్లో జై తెలంగాణ అంటేనే ఇక్కడి వారు నమ్ముతారన్నారు. సీమాంధ్ర నేతలంతా తెలంగాణ వ్యతిరేకులేనని విమర్శించారు. ప్రభుత్వం మద్యం సిండికేట్‌లో ఎసిబి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సిండికేట్లతో సంబంధం ఉన్న వారిపై కేసులు పెట్టాలన్నారు. ఇసుక మాఫియాతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ అంశంపై తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. చంద్రబాబు రైతు పోరు బాట పేరుతో తెలంగాణలో దండయాత్ర చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం ఏడువందల మంది విద్యార్థులు, యువకులు చనిపోతే పరామర్శించని బాబు కల్తీ సారా మృతులను పరామర్శించడం ఏమిటన్నారు.

గ్రామాల్లో మద్యం ఏరులై పారడానికి చంద్రబాబే కారణమని టిఆర్ఎస్ మహిళా విభాగం నేత పద్మా దేవెందర్ రెడ్డి అన్నారు. కల్తీ సారా బాధితులను బాబు పరామర్శించడం హాస్యాస్పదమన్నారు. అతనిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ మద్యం నిషేధం అమలు చేస్తే బాబు దానికి తలుపులను బార్లా తెరిచారన్నారు. కాగా జగన్ తెలంగాణలో యాత్ర చేస్తే ఏం చేయాలో తెలంగాణవాదులకు తెలుసునని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ వేరుగా వరంగల్ జిల్లాలో అన్నారు.

English summary
We are not believing YSR Congress Party chief YS Jaganmohan Reddy with his statement on Telangana, said TRS MLA KT Rama Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X