టిడిపి ఓట్లు పెరగలేదు, అన్ని సీట్లూ మావే: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో స్థానాలన్నీ తమవేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. పార్టీ పల్లెబాట ఇంచార్జీల సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఒక్క శాతం ఓట్లు కూడా పెరగబోవని ఆయన అన్నారు. సర్వే ఫలితాలను ఆయన వెల్లడించారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఈ నెల 7,8.9 తేదీల్లో పల్లె బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 17వ తేదీన పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతుందని, 18వ తేదీన తెలంగాణ జెఎసి సమావేశం జరుగుతుందని ఆయన అన్నారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణకు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యాయని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. కొండా సురేఖపై పరకాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. వరంగల్లు జిల్లా జనగామలో తమ నేత సునీతపై దురుసుగా వ్యవహరించిన సిఐని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు రైతు సమస్యలపై మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. జనగామలో అరెస్టు చేసిన తమ నేతలను విడుదలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే ప్రజలు నిలదీస్తారని ఆయన చెప్పారు.

తెలంగాణలో పర్యటించే ఆంధ్రాబాబులందరినీ నిలదీస్తామని ఆయన చెప్పారు. మహబూబ్‌నగర్ శానససభా నియోజకవర్గంలో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. నాగర్ కర్నూలులో మాత్రం నాగం జనార్దన్ రెడ్డికి మద్దతిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+