వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయన్స్‌తో రామోజీ బంధం రుజువు: కొణతాల

By Pratap
|
Google Oneindia TeluguNews

Konathala Ramakrishna
హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఈటీవీ తెలుగేతర టీవీ చానెళ్లను రిలయన్స్ సంస్థ కొనుగోలు చేయడంతో రామోజీ రావుకు ఆ సంస్థతో గల బంధం రుజవైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. నష్టాల్లో ఉన్న రామోజీ రావు సంస్థలను గట్టెక్కించడానికి రియలన్స్ సంస్థ ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు గౌరవాధ్యక్షురాలు తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు అక్రమార్జన కేసులో వేసిన పిటిషన్‌లో కూడా ఇదే అభియోగం మోపారని ఆయన గుర్తు చేశారు.

రామోజీ రావు, రిలయన్స్ వ్యాపార బంధంతో ఇక్కడ క్విడ్ ప్రోకో (ఫలానికి ప్రతిఫలం) ఉన్నట్లుగా తేటతెల్లమైందని ఆయన అన్నారు. కేజి బేసిన్‌లో గ్యాస్ బ్లాకులను వేలంలో తీసుకోవడానికి రిలయన్స్‌కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా సహాయ సహకారాలు అందించారని, అందుకు ప్రతిఫలంగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన రామోజీ సంస్థల్లో రిలయన్స్ పెట్టుబడులు పెట్టిందని ఆయన అన్నారు. వాస్తవానికి గతంలోనే రిలయన్స్‌కు అనుబంధంగా ఉండిన జెఎం ఫైనాన్స్ ద్వారా నిమేష్ కంపానీ రూ. 18000 కోట్ల నష్టాల్లో ఉన్న రామోజీ సంస్థల్లో రూ. 2600 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారని ఆయన అన్నారు.

English summary
YSR Congress leader Konathala Ramakrishna has said that the relation between Reliance and Ramoji Rao is prooved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X