హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయ సాయి రెడ్డిని రక్షించే యత్నం: ఎర్రన్నాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందని తెలుగుదేశం సీనియర్ నేత కె. ఎర్రన్నాయుడు ఆరోపించారు. జగన్ ఆస్తుల కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి విజయ సాయి రెడ్డి రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్‌గా వెళ్లేందుకు ప్రయత్నించారని, ఆ ప్రయత్నానికి ప్రభుత్వం సహకరించిందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో విజయ సాయి రెడ్డిని రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్‌గా నియమించవచ్చునేమో తెలిపాలని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ నుంచి క్లియరెన్స్ కోరినట్లు ఆయన తెలిపారు.

ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అడగాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని ఆయన అడిగారు. జగన్, కాంగ్రెసు కుమ్మక్కయ్యారని చెప్పడానికి అదే నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు వేర్వేరు కాదని, కాంగ్రెసు అనే విషవృక్షంలో వైయస్సార్ కాంగ్రెసు ఓ కొమ్మ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ప్రతి కుంభకోణంలోనూ సంబంధిత ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రులను, అధికారులను బాధ్యులను చేయాలని, వారిపై విచారణ జరిపించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

English summary
TDP senior leader Yerram Naidu accused that Government has tried to protect Vijaya Sai Reddy from YS Jagan case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X