వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై విజయమ్మ పిటిషన్ మరో బెంచీకి బదిలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆస్తుల కేసుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో మరో బెంచీకి బదిలీ అయింది. చంద్రబాబు ఆస్తుల కేసును రాష్ట్ర హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ విజయమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ భండారీ బెంచ్ ముందుకు వచ్చింది. అయితే, రిలయన్స్ ప్రతివాదిగా ఉన్నందున పిటిషన్ విచారణను మరో బెంచీకి బదిలీ చేయాలని దీపక్ వర్మ సూచించారు. రిలయన్స్ ప్రతివాదిగా ఉన్న ఏ కేసును కూడా తాను విచారించబోనని దీపక్ వర్మ చెప్పారు.

గతంలో గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో కూడా రిలయన్స్ ప్రస్తావన ఉండడంతో విచారణ నుంచి దీపక్ వర్మ తప్పుకున్నారు. వైయస్ విజయమ్మ పిటిషన్ విషయంలోనూ అదే జరిగింది. దీంతో విజయమ్మ పిటిషన్‌పై విచారణ జస్టీస్ దీపక్ వర్మ, భండారీ బెంచ్ నుంచి మరో బెంచీకి మారింది. రాష్ట్ర హైకోర్టులో విచారణను చంద్రబాబు ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున విచారణను మరో హైకోర్టుకు మార్చాలని విజయమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

English summary
Hearing on YSR Congress MLA YS Vijayamma's petition was shifted to another bench in Supreme court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X