బాబు కేసు బదలీపై విజయమ్మ పిటిషన్: నేడు విచారణ

కాగా రెండు నెలల క్రితం వైయస్ విజయమ్మ చంద్రబాబు ఆస్తులపై 2424 పేజీల పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన హైకోర్టు సిబిఐ, డిజిపి తదితర నాలుగు విచారణకు ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు సూచనల మేరకు తన ఆస్తులపై విచారణ ఆపాలని చంద్రబాబు తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, తమ వాదనలు వినకుండానే విచారణకు ఎలా ఆదేశిస్తారని బాబు తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు చంద్రబాబు ఆస్తుల విచారణపై స్టే విధించింది.












Click it and Unblock the Notifications