బాబును సిఎం చేయడానికే టిటిడిపి డ్రామాలు: ఈటెల

చంద్రబాబు ఆంధ్రా గూండాలతో ఇక్కడ దాడి చేస్తున్నారన్నారు. బాబు ఎవర్ని ఉద్దరించడానికి ఈ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన యాత్ర కారణంగా పదిహేను మంది గాయపడ్డారన్నారు. టిటిడిపి నైజం బయటపడిందన్నారు. ప్రజలు టిడిపిని పాతిపెడతారని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకే బాబు యాత్ర అనివిమర్శించారు. బాబు యాత్రలు చేస్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. యాత్ర పేరుతో బాబు ప్రజల రక్తం కళ్ల చూస్తున్నారన్నారు. సకల జనుల సమ్మెపై ఏనాడైనా టిటిడిపి నేతలు మాట్లాడారా అన్నారు.












Click it and Unblock the Notifications