నష్టనివారణ చర్యల్లో ముఖ్యమంత్రి, ఢిల్లీకి దూత

ఆజాద్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా జరిగిన నష్టాన్ని నివారించుకోవడానికి తనకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ రంగా రెడ్డిని కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పంపించారు. ఆయన శనివారంనాడు హోం మంత్రి చిదంబరాన్ని కలిసి పరిస్థితిని వివరించారు. రాష్ట్ర పరిస్థితులపై, పార్టీ తీరుపై ఆయన పార్టీ అధిష్టానానికి ఓ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే తనకు వ్యతిరేకంగా పని చేయించారనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తన దూతను ఢిల్లీకి పంపించిన నేపథ్యంలో బొత్స ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి తన వాదనను వినిపించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, తాను వ్యక్తిగతమైన పని మీద ఢిల్లీ వెళ్తున్నట్లు బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సమన్వయ కమిటీ కూర్పు పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రమైన ఆసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications