వైయస్ జగన్‌ను పర్యటనను అడ్డుకోగలరా: రేవంత్ రెడ్డి

Revanth Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిజామాబాద్ జిల్లా పర్యటనను అడ్డుకోగలరా అని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ జెఎసి నాయకులను అడిగారు. కాంగ్రెసు, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. అది ప్రజల పట్ల విష కూటమిగా తయారైందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసును కాపాడడానికే చంద్రబాబు పర్యటన సందర్భంగా తెలంగాణ జెఎసి వరంగల్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిందని ఆయన అన్నారు.

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఫామ్ హౌస్‌లో నిద్రపోయారని, తెలంగాణ జెఎసి నేత కోదండరామ్ హైదరాబాదులో ఉన్నారని, వారు కదలకుండా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారని, అలా విద్యార్థులను, ప్రజలను బలి చేయడానికి వారిద్దరు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. విద్యార్థులను, యువకులను, ప్రజలను రెచ్చగొట్టి కాంగ్రెసు పార్టీని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు బహిరంగ సభకు 50 వేల మంది దాకా వచ్చారని, అది చూసైనా తెరాసకు, తెలంగాణ జెఎసికి కనువిప్పు కావాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+