ముదురుతున్న విభేదాలు, మమత హెచ్చరిక

Mamata Banerjee
కోల్‌కతా: కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తమ మిత్రపక్షం కాంగ్రెసుపై తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ధ్వజమెత్తారు. కూటమి నుంచి కాంగ్రెసు తప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని, సిపిఎంతో కలిసి పనిచేయాలనుకుంటే వెళ్లిపోవచ్చునని ఆమె శనివారంనాడు అన్నారు. సింగూరు, నందిగ్రామ్‌ల్లో తమ పార్టీ ఒంటరిగానే పనిచేసిందని, ఒంటరిగా వెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు. రచయితల భవనం వద్ద ఆమె కాంగ్రెసుపై తీవ్రంగా మండిపడ్డారు. రాయ్‌గంజ్ కాలేజీ ఆవరణలో జరిగిన హింసతో ఇరు పార్టీల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. తృణమూల్ ఛాత్ర పరిషత్ కార్యకర్తలు కళాశాల ప్రిన్సిపాల్‌ను కొట్టారు.

రాయ్‌గంజ్ సంఘటన దురదృష్టకరమైందని ఆమె అన్నారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ విద్యార్థులను రాయ్‌గంజ్ కళాశాలలో నామినేషన్ వేయకుండా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కొడుతున్నారని, గత 34 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్నది ఇదేనని ఆమె అన్నారు. పెట్రోల్ ధరల పెంపును, రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐలను, లోక్‌పాల్ బిల్లులో లోకాయుక్త క్లాజ్‌లను తాము వ్యతిరేకించడం వల్ల కాంగ్రెసు తమపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోందని ఆమె అన్నారు. అధికార యంత్రాంగాన్నంతా సిపిఎం రాజకీయమయం చేసిందని ఆమె విమర్శించారు. కాంగ్రెసు సిపిఎంతో కలిసి పనిచేస్తోందని ఆమె విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+