ఎమ్మెల్యేల చిటపట!: పదవులపై చిరుకు కొత్త తలనొప్పి

చిరు వర్గం సీనియర్ నేతలతో పాటు ప్రాంతాల వారిగా ఎమ్మెల్యేలు చిరుపై చిటపటలాడుతున్నారట. రెండు మంత్రి పదవులు కాకుండా మూడు పదవుల కోసం పట్టుబట్టాల్సి ఉండేనని, ఆ ఆ రెండు ఇద్దరికి ఇస్తే మా పరిస్థితి చెప్పండని అడుగుతున్నారట. అంతేకాదు చిరు తన వర్గంలో కొందరికే ప్రాధాన్యం ఇవ్వడంపై కొందరు అలకబూనుతున్నారట. ఇటీవల కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌కు విందు కోటగిరి ఆధ్వర్యంలోనే ఖరారైనప్పటికీ ఆయనను చిరు ఆహ్వానించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవులు ఆశించిన వారిలో వంగా గీత, కన్నబాబు, బండారు సత్యానందరావులతో పాటు తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందులో ఎవరికో ఒకరికి ప్రభుత్వ విప్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అలా అయితే మిగిలిన వారు చిరంజీవిపై గుర్రుగా ఉండే అవకాశముంది. ఇప్పటి వరకు తన వర్గం పదవుల కోసం అధిష్టానం వద్ద గట్టిగా పట్టబట్టిన చిరంజీవి ఇక నుండి తన వర్గాన్ని సముదాయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications