LPG కనెక్షన్ బిగ్ అప్డేట్: రూల్స్ మరింత కఠినం.. ఇకపై..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ చమురు, గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముడి చమురు, గ్యాస్ సరఫరాలో ఆలస్యం అవుతోంది. అయితే దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా LPG విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త రూల్ ప్రకారం.. భారత్ లోని ఏ కుటుంబం కూడా ఒకే అడ్రస్ పై ఎల్పీజీ అలాగే పీఎన్జీ రెండింటినీ కలిపి ఉంచుకోవద్దు. వినియోగదారులు ఈ రెండింటిలో ఏదో ఒక కనెక్షన్ ను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇక రెండు కనెక్షన్లు ఉన్నవాళ్లు జూన్ 30 లోగా ఏదో కనెక్షన్ ను తిరిగి ఇచ్చేయడం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వినియోగదారులు జూన్ 30 లోగా ఒక కనెక్షన్ ను వదులుకోకపోతే జూలై 1 నుంచి ఆయిల్ కంపెనీలు ఏదో కనెక్షన్ ను ఆటోమెటిక్ గా నిలిపివేస్తాయి. ఆ తర్వాత బ్లాక్ చేసిన కనెక్షన్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది. ఈ కొత్త నిబంధనను తీసుకురావడానికి గల కారణాలు చూస్తే చాలా నగరాల్లో ప్రజలు సురక్షితమైన, చౌకైన, సౌకర్యవంతమైన పీఎన్జీ కనెక్షన్లకు మారినప్పటికీ బ్యాకప్ ఆప్షనల్ గా ఎల్ పీజీ సిలిండర్లను అలాగే ఉంచుకుంటున్నారు. దీనివల్ల గ్యాస్ సరఫరా వ్యవస్థపై అదనపు భారం పడుతోంది.
దేశంలో బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడానికి, అనవసరమైన డబుల్ గ్యాస్ సరఫరా తగ్గించడానికి అలాగే దేశవ్యాప్తంగా మరింత సమర్థవంతమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం ఈ నో డ్యూయల్ గ్యాస్ కనెక్షన్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.
ఇక గ్యాస్ కనెక్షన్ సరెండర్ చేసే విధానం చూస్తే.. ముందుగా వినియోగదారులు మీ సంబంధిత గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ కు వెళ్లాలి. అక్కడ కనెక్షన్ సరెండర్ ఫామ్ ను పూర్తి చేయాలి. మీ వద్ద ఉన్న గ్యాస్ సిలిండర్, రెగ్యూలేటర్ ను ఏజెన్సీకు తిరిగి అప్పగించాలి. దీని ద్వారా ఏజెన్సీ వారు మీకు ఒక సరెండర్ సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే మీరు కనెక్షన్ తీసుకునేప్పుడు చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని మీకు రీఫండ్ చేస్తారు.

మరోవైపు ప్రజలకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం శాఖ వెల్లడిస్తోంది. దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి వినియోగానికి సరిపడేలా 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. పరిశ్రమలు, పీఎన్జీ అవసరాల కోసం 60 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. అలాగే గృహ అవసరాల కోసం 45 రోజులకు సరిపడా ఎల్పీజీ రోలింగ్ స్టాక్ అందుబాటులో ఉంది.












Click it and Unblock the Notifications