విజయ్‌కు పోటీగా అజిత్.. తమిళ రాజకీయాల్లో సంచలనం

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఒక సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తాయి. ఇక్కడ వెండితెరపై ఓ వెలుగు వెలిగిన వారే.. సింహాసనాన్ని అధిష్ఠించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లాంటి దిగ్గజాల తర్వాత.. తాజాగా 'దళపతి' విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీతో సరికొత్త చరిత్ర సృష్టించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ కోటలను బద్దలు కొడుతూ.. ఎవరూ ఊహించని విధంగా అధికారం చేజిక్కించుకుని, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. పాలనలో అప్పుడే తన మార్క్ చూపిస్తూ విజయ్ దూసుకుపోతుంటే.. ఇప్పుడు కోలీవుడ్‌లో ఆయనకు బద్ధ శత్రువుగా, బాక్సాఫీస్ రైవల్‌గా పేరుపొందిన 'తలా' అజిత్ కుమార్ రాజకీయ అరంగేట్రంపై సరికొత్త చర్చ మొదలైంది. అసలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఏం జరుగుతోంది? అజిత్ నిజంగానే ఎంట్రీ ఇస్తారా? ఇస్తే ఏ పార్టీ నుంచి వస్తారు? అనేది తెలుసుకుందాం.

జయలలిత కట్టిన కోట

దశాబ్దాలుగా తమిళనాడును మార్చి మార్చి పాలించిన డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ఈ ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. కేవలం రెండేళ్ల క్రితం పార్టీ పెట్టిన విజయ్.. అఖండ విజయం సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ సొంతంగా మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చి.. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామంతో అటు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ఇటు అంతర్గత సంక్షోభంలో ఉన్న ఏఐఏడీఎంకే పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డాయి. ముఖ్యంగా జయలలిత కట్టిన బ్రహ్మాండమైన కోట ఏఐఏడీఎంకే.. ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది. విజయ్ హవాకు తట్టుకోలేక ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, ఎమ్మెల్యేలు విడిపోయి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.

arch-rival-ajith-to-compete-against-vijay-a-sensation-in-tamil-politics

అన్నాడీఎంకే ఆశాకిరణం.. 'తలా అజిత్' ( ajith ) అస్త్రం?

అమ్మ మరణం తర్వాత సరైన మాస్ లీడర్ లేక ఏఐఏడీఎంకే కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి, విజయ్ స్పీడ్‌కు బ్రేకులు వేయడానికి ఆ పార్టీ నేతలు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. అదే 'తలా అజిత్ కుమార్' అస్త్రం. జయలలిత బతికున్న సమయంలో అజిత్‌ను ఎంతగానో అప్యాయంగా చూసేవారు. ఒకానొక దశలో అమ్మ తర్వాత ఆ పార్టీ వారసుడు అజిత్ అనే ప్రచారం కూడా గట్టిగా నడిచింది. సినిమాల్లో విజయ్ - అజిత్ ఫ్యాన్స్ మధ్య ఉండే యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరికీ సమానమైన మాస్ ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి రాజకీయంగా విజయ్‌ను ఢీకొట్టాలంటే సినిమా గ్లామర్, విపరీతమైన క్రేజ్ ఉన్న అజిత్ ఒక్కరే సరైన ప్రత్యామ్నాయమని ఏఐఏడీఎంకే భావిస్తోంది.

అజిత్ పొలిటికల్ మైండ్‌సెట్ ఏంటి?
సినిమా ఇండస్ట్రీలో అజిత్ స్టైలే వేరు. ఆయన 'సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్'. కార్ రేసింగ్, బైక్ రైడింగ్, గన్ షూటింగ్ అంటూ తన వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. తన ఇమేజ్ చూసి రాజకీయాల్లోకి లాగాలని ప్రయత్నించినప్పుడు.. అజిత్ ఏమాత్రం మొహమాటపడకుండా తన అధికారిక 'ఫ్యాన్ క్లబ్స్' రద్దు చేసేశారు. సినిమాలను కేవలం వినోదంగానే చూడాలని, రాజకీయాలకు తనను దూరం పెట్టాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏఐఏడీఎంకే తీవ్ర సంక్షోభంలో ఉంది. విజయ్ తన ప్రభుత్వంలోకి జయలలిత కోటలోని కీలక నేతలను లాగేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఎంజీఆర్ కట్టి, జయలలిత పెంచిన పార్టీ కనుమరుగవకుండా చూడాలంటే అజిత్ లాంటి బలమైన వ్యక్తి రావాలని పాత కాపులు కోరుకుంటున్నారు.

ఒకవేళ అజిత్ వస్తే.. తమిళనాడు రాజకీయం ఎలా ఉంటుంది?
తమిళనాడు చరిత్ర చూస్తే.. సినిమా ఇమేజ్ ఇక్కడ ఎప్పుడూ కీలకంగానే పనిచేసింది. విజయ్ గెలుపుతో అది మరోసారి నిరూపితమైంది. ఒకవేళ అజిత్ గనుక ఏఐఏడీఎంకే పగ్గాలు చేపట్టడమో లేదా ఆ పార్టీ తరపున రంగంలోకి దిగడమో జరిగితే.. తమిళనాడు రాజకీయం సరికొత్తగా "విజయ్ వర్సెస్ అజిత్" గా మారిపోతుంది. సినిమాల్లోలాగే రాజకీయ వేదికలపై కూడా ఈ ఇద్దరు స్టార్ల అభిమానుల మధ్య పోరు రసవత్తరంగా మారుతుంది. ద్రవిడ సిద్ధాంతాలకు, కొత్త తరం రాజకీయాలకు మధ్య ఒక పెద్ద సునామీ రావడం ఖాయం. అన్నాడీఎంకే బీజేపీతో పొత్తులో ఉంది. అజిత్ పై అన్నాడీఎంకే ఒత్తిడి పెంచితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+