హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌లో వచ్చిన మార్పేమిటి?: కెసిఆర్‌కు విహెచ్ ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన అడ్డుకోవడానికి వారం రోజుల ముందు నుండే కసరత్తు చేసిన టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారని, వారిద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో బయట పెట్టాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు ఆదివారం ప్రశ్నించారు. నిజామాబాద్ వస్తే అడ్డుకుంటామన్న జెఏసి ప్రకటన చూశాం కాని కెసిఆర్ స్టేట్‌మెంట్ మాత్రం చూడలేదన్నారు. గతంలో తెలంగాణ వ్యతిరేకి అని జగన్ పైన రాళ్లు వేశారని, ఇప్పుడు ఆయనలో కేసిఆర్‌కు ఏం మార్పు కనిపించిందో చెప్పాలన్నారు. జగన్ యాత్ర సందర్భంగా కెసిఆర్ ఏం చేస్తాడో కోదండరాంరెడ్డి ఏం చేస్తాడే చూడాలన్నారు.

వరంగల్‌‍లో చంద్రబాబుకు ప్రధాని స్థాయిలో సెక్యూరిటి ఇచ్చారని ప్రభుత్వాన్ని విమర్శించారు. బాబుకు రక్షణ కల్పించినట్లుగా మేం రాయలసీమకు వెళితే కల్పిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాబుది రైతు యాత్ర కాదని తెలంగాణపై దండయాత్ర అన్నారు. బాబు పర్యటన అడ్డుకోవడం సరికాదని, దేశంలో ఎవరికైనా ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందన్నారు. మద్యం సిండికేట్లలో అన్ని పార్టీల హస్తం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాబు, సిఎం కిరణ్ కుమ్మక్కయ్యారన్న అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందన్నారు. 2014లోపు తెలంగాణ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Is Jagan stand changed on Telangana?, Congress senior leader V Hanumantha Rao questioned TRS chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X