తెలంగాణపై బాబుకు కోర్టు షాక్, కేసుకు ఆదేశాలు

ఫిబ్రవరి 9వ తేదీన చంద్రబాబు తమ ముందు హాజరు కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ తీర్మానాన్ని శాసనసభలో ప్రతిపాదిస్తే తమ పార్టీ మద్దతిస్తుందని చంద్రబాబు చెప్పారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేసిన తర్వాత మాట మార్చారని, అర్థరాత్రి రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించారంటూ మాట మార్చారని మమజనార్దన్ తన పిటిషన్‌లో వివరించారు. చంద్రబాబు మాట మార్చడం ద్వారా తెలంగాణలో 700 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమయ్యారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను చంద్రబాబు దెబ్బ తీశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications