జగన్‌ను కలిసిన మాజీ టిఆర్ఎస్ నేత సంతోష్ రెడ్డి

కొత్తగా పార్టీ స్థాపించడం, తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తానని చెప్పడం కారణంగా ఇటీవల జగన్‌పై తెలంగాణలో కొంత వ్యతిరేకత తగ్గింది. ఆదే సమయంలో ఆయన సంతోష్ రెడ్డి సొంత జిల్లా అయిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంతోష్ రెడ్డి జగన్‌ను కలవడం రాజకీయంగా చర్చానీయాంశమైంది. మొదటి నుండి పక్కా తెలంగాణవాది అయిన సంతోష్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకే జగన్‌ను కలిశారు. ఆర్మూర్‌లో మంగళవారం దీక్ష చేస్తున్న జగన్ సమక్షంలో సంతోష్ రెడ్డి ఆయన పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకోక పోవడం, తెలంగాణ ప్రాంతంలో తాను విభేదించి బయటకు వచ్చిన కెసిఆర్‌కు చెందిన పార్టీ హవా కొనసాగుతుండటం, జగన్ తెలంగాణకు సానుకూలంగా మాట్లాడటం వంటి కారణాల దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు ఆయన నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications