నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు కుమ్ములాటలకే సరి, ఇక జగనే: అమర్నాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Amarnath Reddy
నిజామాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య కుమ్ములాటలకే సమయం సరిపోతుందని, రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని, ఇక నిత్యం సమస్యల కోసం పోరాడుతున్న తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డియే కాబోయే ముఖ్యమంత్రి అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గం శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గురువారం అన్నారు. రైతు సమస్యలపై నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో దీక్ష చేస్తున్న జగన్‌కు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దీక్షా ప్రాంగణంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు అమలు చేయడం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. జగన్ ఎక్కడకు వెళ్లిన అపూర్వ ఆదరణ వస్తోందన్నారు.

బొత్స, సిఎం కుర్చీ కోసం పోట్లాడుకుంటున్నారన్నారు. సభలో అందరికంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసింది తామేనని, నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉందన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు విహార యాత్రలకు వెళ్లడం సరికాదని మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి అన్నారు. గిరిజనుల సమస్యలపై ఎమ్మెల్యేలంతా ఎంజాయ్ చేశారని ఎద్దేవా చేశారు.

English summary
Congress government is neglecting public issues duie to differences between CM Kiran Kumar Reddy and PCC chief Botsa Satyanarayana, said Jagan camp mla Amarnath Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X