నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ దీక్షలో జనాలు లేరనడంపై కొండా సురేఖ కామెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
నిజామాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షలో జనాలు లేరన్న వ్యాఖ్యలపై పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ స్పందించారు. ఆమె నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో జగన్ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభలో ప్రజలు లేరని చెప్పడం సరికాదన్నారు. చాలామంది రైతులు మంగళ, బుధవారాల్లో జగన్‌ను కలిసి వెళ్లారన్నారు. అయినా జనం శిబిరాల్లో ఉండరని బహిరంగ సభలో ఉంటారని చెప్పారు. తాము చేసే దీక్షపై ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం తమకు ఏమాత్రం లేదన్నారు. తెలంగాణపై జగన్ ప్రత్యేకంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోటీకి నిలబెట్టనని చెప్పడం ద్వారానే ఆయన తన వైఖరిని చెప్పారన్నారు.

ఉప ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం తప్పదని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ రావు వేరుగా హైదరాబాదులో అన్నారు. ఉప ఎన్నికలు జరిగే 24 స్థానాలలో కనీసం పదమూడు స్థానాల్లో టిడిపికి డిపాజిట్ రాదన్నారు. రోజుకొకటి మాట్లాడుతూ పగటి కలలు కనడం బాబుకు అలవాటే అన్నారు. బాబు తీరు చూస్తుంటే ఆయనకు మతిమరుపు వచ్చిందేమోననే అనుమానం కలుగుతోందన్నారు. సొంత జిల్లాలో నిరాదరణకు గురైన బాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, కాంగ్రెసు కొట్టుకుపోతాయన్న బాబు మరి తనకు ప్రత్యర్థి ఎవరో చెప్పాలన్నారు.

English summary
YS Jaganmohan Reddy camp Congress MLA Konda Surekha said that public will come to Jagan's meeting which held this evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X