కిరణ్ ఆలోచన: ముగ్గురు మంత్రులకు ఉద్వాసన

జౌళి శాఖ మంత్రి పి. శంకరరావు, మైనారిటీ సంక్షేమ మంత్రి అహ్మదుల్లా, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల మంత్రి తోట నర్సింహాలను తొలగించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. పి. శంకరరావు బహిరంగ విమర్శలు చేస్తూ కొరకరాని కొయ్యగా మారడంతో ఆయనను తొలగించి, తెలంగాణ నుంచి సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా నుంచి సి. రామచంద్రయ్య చిరంజీవి అభ్యర్థిగా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నందున ఆ జిల్లా విషయంలో సమతుల్యత పాటించడానికి అహ్మదుల్లాను తొలగించాలని ఆయన భావిస్తున్నారు. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ మహ్మద్ జానీకి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, తనకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ రంగారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో నియమించాలనే ఆలోచనలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.












Click it and Unblock the Notifications