తెలంగాణలో వైయస్ జగన్ పాదయాత్రకు ప్లాన్?

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పాదయాత్రకు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 48 గంటల పాటు చేసిన రైతు దీక్ష విజయవంతమైందని భావిస్తున్న ఆయన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేపట్టనున్నట్లు సమాచారం. ఆర్మూర్ రైతు దీక్షపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. జగన్ దీక్ష విజయవంతమైందని, తెలంగాణలో జగన్ చేత మరిన్ని కార్యక్రమాలు పెట్టించాలని వారు భావించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన పాదయాత్ర చేపట్టే అవకశాలున్నట్లు చెబుతున్నారు.

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును, పోలవరం ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం జగన్ గతంలో పాదయాత్ర చేశారు. ఈ రెండు ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల మనసు దోచుకోవడానికి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేయాలని వైయస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ భూములకు సాగునీరు అందించడానికి వైయస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టును తలపెట్టారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాదయాత్రలు తలపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+