బాలకృష్ణ రాజకీయ ఆరంగేట్రంపై పురంధేశ్వరి కామెంట్

కాగా ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన బాలకృష్ణ తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఏ ప్రాంతం నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ ప్రాంతం నుండి పోటీకి కూడా సై అన్నారు. బాలయ్య ఆరంగేట్రంపై ఆయన సోదరుడు హరికృష్ణ కూడా ఇంతకుముందే స్పందించారు. బాలయ్య పోటీ చేస్తే తాను ప్రచారం చేసి గెలిపిస్తానని చెప్పారు. కారణమేదైనా బాలయ్య రాజకీయ ఎంట్రీని ఆయన కుటుంబ సభ్యులు అందరూ దాదాపు స్వాగతిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. బాలయ్య కూడా రాజకీయాల్లోకి సాధ్యమైనంత త్వరగా రావాలనే ఉత్సాహంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications