PEDDI Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది.. గూస్ బంప్స్ గ్యారంటీ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ 'పెద్ది'. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ లో రిలీజ్ అయింది. పెద్ది ట్రైలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అంత అద్భుతంగా ఉంది. ఆటే నా పొగరు అనే డైలాగ్, మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారు అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

ఇక రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ ను వేగవంతం చేసింది. మరోవైపు పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పటికే వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటున్నాడు. సినిమా గురించి ఆయన చెబుతున్న ఒక్కో విషయం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. బుచ్చిబాబు ఇచ్చిన హైప్ ఇప్పుడు ట్రైలర్ కనిపిస్తోంది. ఇక ఫుల్ మూవీ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంటూ మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడు సైతం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Peddi Trailer Out Ram Charan and Buchi Babu Sana s Rural Sports Action Drama Sets Hearts Racing

పెద్ది మూవీ రన్ టైమ్ 3 గంటలకు పైగానే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 2 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం. స్పోర్ట్స్ నేపథ్యానికి బలమైన ఎమోషన్స్ ను జోడించి అలాగే పూర్తిగా కమర్షియల్ పద్దతిలో ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది. ఇక పెద్దిలో అసలైన సినిమా చివరి 50 నిమిషాలు అని టాక్ బలంగా వినిపిస్తోంది. చివరి 50 నిమిషాల్లో రామ్ చరణ్ కనిపించరని పెద్ది క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుందని దర్శకుడు బుచ్చిబాబు ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

మరి ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తుందో చూడాలి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 2న హైదరాబాద్‌ లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు మేకర్స్. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. సినిమాటోగ్రఫీ రత్నవేలు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+