హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికారముందనే: పిఆర్పీపై పాలడుగు పరోక్ష వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paladugu Venkat Rao
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నందువల్లే కొందరు ఇటీవల ప్రభుత్వంలోకి దూరుతున్నారని, ఈ తరుణంలో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు స్థైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై ఉందని శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట రావు సోమవారం అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ప్రజారాజ్యం పార్టీనే ఉద్దేశించి అన్నట్లుగా కనిపిస్తోంది. సొంత పార్టీని రక్షించుకోవాలంటే సిఎం, పిసిసి అధ్యక్షుడు మరింత దూకుడుగా పని చేయాలన్నారు. జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు ప్రభుత్వం, పార్టీ మరింత ధీటుగా నడవాలని ప్రజలు తమను కోరుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించి పార్టీ గట్టెక్కాల్సి ఉందన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల్లో రెండున్నరేళ్లుగా వెలితి కనిపిస్తోందని, నిజమైన కార్యకర్తలెవరికీ గుర్తింపు లభించడం లేదన్న ఆవేదన నెలకొందన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హోంమంత్రి చిదంబరం వహించాలన్నారు. ఇప్పటి వరకు దేశంలోని వైఫల్యాలకు విజయాలకు బాధ్యత వహించాల్సింది వీరిద్దరేనని బాధ్యతను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై వేయడం సరికాదన్నారు.

English summary

 MLC Paladugu Venkat Rao commented against PRP for their attitude. He suggested CM Kiran and PCC chief Botsa to strengthen party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X