సిఎం కిరణ్ కుమార్‌కు అధిష్టానం నో ఎందుకు చెప్పింది?

అయితే బొత్సతో పాటు పలు అంశాలను అధిష్టానం పరిగణలోకి తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఓ వైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మరోవైపు తెలంగాణ సమస్య ఉన్న ప్రస్తుత తరుణంలో పునర్వ్యవస్థీకరణ పార్టీని మళ్లీ సంకట స్థితిలో పడేస్తుందని అధిష్టానం భావించినట్లుగా సమాచారం. తెలంగాణ ఉద్యమం చల్లబడినప్పటికీ దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్నప్పటికీ సానుభూతి పవనాలు వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పునర్వ్యవస్థీకరణ చేస్తే ఉద్యమం, జగన్ పేరుతో అసంతృప్తులు ఎవరైనా పార్టీకి దూరమయ్యే అవకాశాలను కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకొని ఉండవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications