వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాది వైయస్ జగన్, చంద్రబాబు పార్టీల్లా కాదు: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తమది వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లా కుటుంబ పార్టీ కాదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆ పార్టీల్లో వ్యక్తిగత పోకడలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని, తమ పార్టీలో విధానమే ధ్యేయంగా ఆలోచన చేస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిలా తాము పూటకో మాట, రోజుకో మాట మాట్లాడలేమని, జైలు ఊచలు లెక్కించాల్సిన చంద్రబాబు బయట ఉండిపోతున్నారని, తాము అలా ఉండలేమని ఆయన అన్నారు. తమ పార్టీలో మాటకు కట్టుబడి ఉండాల్సి వస్తుందని, అలా లేనప్పుడు పార్టీని వదులుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చంద్రబాబు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రైతుల గురించి ఆలోచించలేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు. చిరంజీవికి తమ పార్టీ శానససభ్యుడిగా, నాయకుడిగా గౌరవం ఉంటుందని ఆయన అన్నారు. శంకరరావును తాము మంత్రి వర్గం నుంచి గెంటేయలేదని ఆయన అన్నారు. శంకరరావే వెళ్లి పోయే పరిస్థితి తెచ్చుకున్నారని ఆయన అన్నారు. పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ముఖ్యమంత్రి నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. జోడు పదవుల గురించి ఏ వేదికలోనూ చర్చ జరగలేదని ఆయన చెప్పారు. వర్గాన్ని, ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుని చేస్తారని, వ్యక్తులను పరిగణనలోకి తీసుకుని చేయబోరని ఆయన చెప్పారు. అసంతృప్తిని నివారించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు.

రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలదే అని ఆయన అన్నారు. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా, వ్యక్తిగతంగా ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకుంటామని, మీడియా మాత్రం వాస్తవాలు తెలుసుకుని వార్తాకథనాలు రాయాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో తనకు విభేదాలు ఉన్నట్లు కథనాలు రాయడం సరి కాదని, ఏదైనా ఉంటే తమను అడిగితే వివరణ ఇస్తామని, తమను వివరణ అడిగి రాయాలని ఆయన సూచించారు. సోనియా గాంధీ నాయకత్వంలో తాను, ముఖ్యమంత్రి పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తామని ఆయన చెప్పారు. రేపు గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. మంత్రి వర్గంలో కాపు వర్గానికి చెందినవారు నలుగురే ఉన్నారని ఆయన చెప్పారు.

English summary
PCC president Botsa Satyanarayana said that his party is not like TDP and YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X